News May 25, 2024

కుడివైపుంటే విజయమే.. SRHకు కలిసొచ్చేనా?

image

SRHకి ట్రోఫీని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు కెప్టెన్ కమిన్స్. IPL 2024లో అద్భుతమైన కెప్టెన్సీతో టీమ్‌ను ఫైనల్‌కు చేర్చారు. రేపు KKRతో ఫైనల్ జరగనుండగా ఈసారి SRHదే కప్ అంటూ ఫ్యాన్స్ ఓ ఫొటోను షేర్ చేస్తున్నారు. AUS కెప్టెన్‌గా పాట్ కమిన్స్ WTC, ODI WCలు గెలుపొందగా.. ఆయా ట్రోఫీలు ఆయనకు కుడివైపు ఉన్నాయి. IPL ట్రోఫీ పాట్‌కి కుడివైపు ఉండటంతో.. ఈ లాజిక్‌తో SRHదే విజయమంటున్నారు. మీరేమంటారు?

Similar News

News December 1, 2025

NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్‌(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్‌సైట్: https://www.nin.res.in

News December 1, 2025

రాజ్ నిడిమోరు గురించి తెలుసా?

image

రాజ్ నిడిమోరు తిరుపతిలో (1979) జన్మించారు. SVUలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. USలో ఉద్యోగం చేశారు. సినిమా కల నెరవేర్చుకునేందుకు ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టారు. 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ఆ సిరీస్ సీజన్-2లో సమంత నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. తాజాగా వారు ఒక్కటయ్యారు.

News December 1, 2025

వయస్సును వెనక్కి తిప్పే బొటాక్స్

image

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. వాటిల్లో ఒకటే బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్‌ ప్రొటీన్‌ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే చర్మంపై గీతలు, ముడతలు తగ్గి మృదువుగా కనిపిస్తుంది. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది.