News August 27, 2024
టీ20 WCలో టీమ్‌లో లేకపోవడంపై స్పందించిన రింకూ

సిక్సర్లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సత్తా ఉన్నప్పటికీ టీ20 వరల్డ్ కప్‌లో టీమ్-15లో రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. దీనిపై రింకూ తాజాగా స్పందించారు. ‘రోహిత్ భాయ్ నా దగ్గరకు వచ్చి అర్థమయ్యేలా చెప్పారు. నేను ఇంకా చాలా చిన్నవాడినేనని, భవిష్యత్తులో చాలా ప్రపంచ కప్లున్నాయని నిరాశ చెందొద్దన్నారు. కష్టపడి పనిచేయాలని, ఆటపై దృష్టి పెట్టాలని నాలో స్థైర్యాన్ని నింపారు’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News December 14, 2025
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా గోయల్

నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా ప్రభుత్వ మాజీ ఉద్యోగి రాజ్‌కుమార్ గోయల్ అపాయింట్ అయ్యారు. ప్రధాని మోదీ సారథ్యంలోనే ముగ్గురు సభ్యుల కమిటీ ఈయన పేరును ఎంపిక చేసింది. మరో 8మంది ఇన్ఫర్మేషన్ కమిషనర్లనూ ప్యానెల్ సిఫార్సు చేసింది. రేపు RK గోయల్‌తో CICగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించనున్నారు. ఈయన అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరాం యూనియన్ టెరిటరీస్ క్యాడర్‌కు చెందిన 1990వ బ్యాచ్ IAS(రిటైర్డ్).
News December 14, 2025
AIIMS మంగళగిరి 76 పోస్టులకు నోటిఫికేషన్

<
News December 14, 2025
AIIMS మంగళగిరి మరో నోటిఫికేషన్ విడుదల

AIIMS మంగళగిరి 4 పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. కమ్యూనిటీ& ఫ్యామిలీ మెడిసిన్, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS, MSc, PhD ఉత్తీర్ణులైన వారు JAN 2వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 37ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. బేసిక్ పే రూ.56,100. JAN 9న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్సైట్: https://www.aiimsmangalagiri.edu.in


