News June 1, 2024

మహారాష్ట్రలో హోరాహోరీ

image

మహారాష్ట్రలో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు Times Of India Poll అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 22-26, ఇండియా కూటమికి 23-25, ఇతరులకు 0-10 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Similar News

News November 13, 2025

టెన్త్ పరీక్షలు అప్పుడేనా?

image

TGలో పదో తరగతి పరీక్షలు 2026 మార్చి 18(బుధవారం) నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇంటర్ పరీక్షలు అదే రోజు ముగియనుండగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ప్రభుత్వం ఆమోదిస్తే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. అటు టెన్త్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును పొడిగించాలని TGHMA విద్యాశాఖను కోరింది.

News November 13, 2025

భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

image

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.

News November 13, 2025

నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

image

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్‌కు ముందు ఉమర్‌కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.