News January 20, 2025
LSG కెప్టెన్‌గా రిషభ్ పంత్

ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను నియమించింది. వచ్చే సీజన్ నుంచి పంత్ తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తారని ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా ప్రకటించారు. వేలంలో పంత్‌ను LSG రూ.27కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ వికెట్ కీపర్-బ్యాటర్ ఆ జట్టుకు తొలి ట్రోఫీని అందిస్తారేమో వేచి చూడాలి.
Similar News
News October 17, 2025
బ్యాంక్ కాల్స్ ఇక ఈ నంబర్ నుంచే!

స్పామ్ కాల్స్‌తో ఇబ్బందిపడుతున్న వినియోగదారులకు త్వరలో ఉపశమనం లభించనుంది. ఇకపై బ్యాంకు నుంచి వచ్చే కాల్స్ ‘1600’తో మొదలయ్యే నంబర్‌తో మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ & బీమా కంపెనీలు 1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి మాత్రమే కాల్ చేయాలని TRAI నిర్ణయించింది. గతంలో ఈ సిరీస్ కొన్ని బ్యాంకులకే పరిమితంగా ఉండేది. ఇతర కంపెనీలు పాత 140 లేదా మొబైల్ నంబర్ నుంచి కాల్స్ చేసేవి. SHARE IT
News October 17, 2025
రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

TG: రేపు బంద్ పేరిట అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని DGP శివధర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా రేపు రాష్ట్రవ్యాప్తంగా BC సంఘాల నేతలు బంద్ చేపట్టనున్నారు. దీనికి INC, BRS, BJP, CPI, CPM సహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.
News October 17, 2025
రాహుల్ గాంధీపై అమెరికన్ సింగర్ సెటైర్లు

ట్రంప్‌కు PM మోదీ భయపడుతున్నారంటూ LoP రాహుల్ గాంధీ చేసిన <<18020106>>విమర్శలపై<<>> US సింగర్, నటి మేరీ మిల్బెన్ సెటైర్లు వేశారు. ‘రాహుల్ మీరు రాంగ్. ట్రంప్‌కు PM మోదీ భయపడటం లేదు. ఆయనకు ఈ లాంగ్ గేమ్‌పై అవగాహన ఉంది. USతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ట్రంప్ లాగే మోదీ కూడా తమ దేశానికి ఏది ముఖ్యమో అదే చేస్తున్నారు. దేశాధినేతలు అలాగే చేస్తారు. ఇది మీకు అర్థం కాదు. మీకు PM అయ్యేంత చతురత లేదు’ అని ట్వీట్ చేశారు.