News November 3, 2024

రిషభ్ పంత్ ఫైటింగ్ ఫిఫ్టీ

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ (53*) అర్ధ సెంచరీ సాధించారు. 7 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో ఆయన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. కాగా 29కే 5 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ క్రీజులో అడుగుపెట్టి ఒంటరి పోరాటం చేస్తున్నారు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 92/6గా ఉంది. జట్టు విజయానికి మరో 55 పరుగులు అవసరం.

Similar News

News December 26, 2024

మస్కట్‌ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్

image

AP: మస్కట్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.

News December 26, 2024

Latest Data: ఓటింగ్‌లో మహిళలే ముందు

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 65.78% మంది అర్హ‌త క‌లిగిన మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు తాజా గ‌ణాంకాల ద్వారా వెల్ల‌డైంది. పురుషులు 65.55% మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. త‌ద్వారా వ‌రుస‌గా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పురుషుల కంటే మ‌హిళ‌లే అత్య‌ధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయ‌డం గ‌మ‌నార్హం.

News December 26, 2024

సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?

image

ట్యాక్స్ పేయర్స్‌కి ఊరట కలిగించేలా 2025 బ‌డ్జెట్‌లో కేంద్రం నిర్ణ‌యాలు ఉంటాయ‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన ప‌న్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 ల‌క్ష‌ల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% ప‌న్ను చెల్లించాల్సి వ‌స్తోంది. ప్ర‌స్తుతం దేశం అర్థిక స‌వాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవ‌న వ్య‌యాల నేప‌థ్యంలో Tax Payersకి ఊర‌ట క‌లిగించేలా Budgetలో నిర్ణ‌యాలుంటాయ‌ని స‌మాచారం.