News August 20, 2024
CSKలోకి రిషభ్ పంత్?

IPLలో రిషభ్ పంత్ CSKలోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా పంత్ పెట్టిన ఓ పోస్టే అందుకు కారణం. సూపర్ స్టార్ రజినీకాంత్‌ను అనుకరిస్తూ కుర్చీలో కూర్చొని ఫొటోకు స్టిల్ ఇచ్చారు. ‘తలైవా’ అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి రజినీని ట్యాగ్ చేశారు. గతంలో ఓసారి ధోనీ సైతం ఇలాగే తలైవా స్టైల్లో ఫొటో పోస్టు చేశారు. MSD కెరీర్ ముగుస్తుండటంతో ఆ స్థానాన్ని పంత్ భర్తీ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం మొదలైంది.
Similar News
News October 25, 2025
విడుదలకు సిద్ధమైన ‘మాస్ జాతర’.. రన్‌టైమ్ ఇదే

రవితేజ-శ్రీలీల ‘మాస్ జాతర’ రన్‌టైమ్ లాక్ అయింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 గంటల 40 నిమిషాల నిడివి ఉంది. అలాగే సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాలను వెల్లడిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘మాస్, ఫన్ అండ్ యాక్షన్ అన్నీ ఒకదాంట్లోనే. ఎంటర్టైన్మెంట్ మాస్‌వేవ్‌ను థియేటర్లలో ఆస్వాదించండి’ అని పేర్కొన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీ OCT 31న రిలీజ్ కానుంది.
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.


