News April 13, 2024

రిషభ్ పంత్ మరో రికార్డు

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఐపీఎల్‌లో మరో రికార్డు సృష్టించారు. కనీసం 3,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్లలో అత్యధిక స్ట్రైక్‌రేట్‌ కలిగిన మూడో బ్యాటర్‌గా పంత్ (148.6) రికార్డులకెక్కారు. అగ్రస్థానంలో ఏబీ డివిలియర్స్ (151.68), రెండో స్థానంలో క్రిస్ గేల్ (148.96) ఉన్నారు. కాగా పంత్ ఈ ఐపీఎల్ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి 194 పరుగులు చేశారు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

Similar News

News March 22, 2026

ప్రత్యేక ఫ్లైట్ డిమాండ్ చేసినట్లు వార్తలు.. కోహ్లీ రియాక్షన్ ఇదే!

image

ఐపీఎల్ కోసం RCB బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇప్పటికే బెంగళూరు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే లండన్‌లో ఉంటున్న కోహ్లీ.. ఈ సీజన్‌లో రెగ్యులర్‌గా ఇంటికి వెళ్లి రావడానికి ప్రత్యేక ఫ్లైట్ అరేంజ్ చేయాలని RCB మేనేజ్మెంట్‌ను డిమాండ్ చేశారని పలు రిపోర్ట్స్ వచ్చాయి. దీనిని కోహ్లీ కొట్టిపారేశారు. ఈ వార్త హాస్యాస్పదంగా ఉందని సూచించేలా ఆ రిలేటెడ్ పోస్ట్ ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసి లాఫింగ్ ఎమోజీ పెట్టారు.

News March 22, 2026

కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

image

పర్షియన్ గల్ఫ్ సముద్ర జలాల్లో ఖతర్‌కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడని అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసేందుకు, మిస్సింగ్ పర్సన్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని పేర్కొన్నారు.

News March 22, 2026

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 15minలో మెసేజ్ డిలీట్!

image

వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనిని యూజర్లు ఎనేబుల్ చేసుకుంటే చాట్ లోని మెసేజ్‌లు వాటికవే డిలీట్ అవుతాయి. మెసేజ్ ఓపెన్ చేసిన టైమ్ నుంచి 15min కౌంట్ డౌన్ మొదలవుతుంది. అది పూర్తవగానే సెండర్, రిసీవర్ చాట్‌లో మెసేజ్ మాయమవుతుంది. ఓపెన్ చేయని మెసేజ్‌లు 24hrs వరకూ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్ దశలో ఉంది. OTP, పాస్‌వర్డ్స్ వంటి వివరాలు షేర్ చేసే వారికి ఇది ఉపయోగపడొచ్చు.