News October 2, 2024

రిషభ్ పంత్ సరదా మనిషి: లబుషేన్

image

టీమ్ ఇండియా ఆటగాళ్లందరిలోకీ భారత కీపర్ రిషభ్ పంత్ తనకు ఆసక్తికరంగా అనిపిస్తుంటారని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ అన్నారు. ‘పంత్ ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటారు. కానీ నిజాయితీగా ఆడతారు’ అని పేర్కొన్నారు. ఇక బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ఏదో విధంగా ఆటను ప్రభావితం చేసే జడేజాను చూస్తే తనకు చిరాకు, అసహనం వస్తుందని మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సరదాగా వ్యాఖ్యానించారు.

Similar News

News December 1, 2025

WGL: పంచాయతీల బకాయిలు రూ.99.68 కోట్లు.?

image

మాజీ సర్పంచులు తమ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బకాయిలను ప్రభుత్వం సమీక్షిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు కోరగా, ఉమ్మడి WGL జిల్లాలో మాజీ సర్పంచులకు రూ.79.68 కోట్లు, ప్రత్యేకాధికారుల పాలనలో కార్యదర్శులు చేసిన ఖర్చులు రూ.20 కోట్లు ఉండవచ్చని అంచనా. మొత్తం బకాయిలు రూ.99.68 కోట్లకు చేరే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశముంది.

News December 1, 2025

చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

image

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.