News June 23, 2024

చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్!

image

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు నెలకొల్పారు. ఈ ఎడిషన్‌లో ఆయన 10 క్యాచ్‌లు అందుకున్నారు. ఈ క్రమంలో గిల్‌క్రిస్ట్ (7) రికార్డును పంత్ బ్రేక్ చేశారు. కాగా ఈ మెగా టోర్నీలో పంత్ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నారు. భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు.

Similar News

News January 15, 2026

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే?

image

సంక్రాంతి రైతుల పండుగ. ఈ పండుగ నాటికి అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం ఇంటికి చేరుతుంది. ఆ సంతోషంలోనే ఈ పండుగ జరుపుకుంటారు. తమకు సహాయం చేసిన పశువులను పూజిస్తారు. కూలీలకు పండిన ధాన్యంలో కొంత ఇస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు, జంగాలు అందరూ సంక్రాంతికే కనిపిస్తారు. వారందరికీ ప్రజలు సంతోషంగా దానధర్మాలు చేస్తారు. ప్రజలు ఒకరితో మరొకరు కృతజ్ఞతతో మెలగాలని చాటి చెప్పడమే ఈ పండుగ ఉద్దేశం.

News January 15, 2026

సంక్రాంతి రోజు ఇలా చేస్తే మంచిది!

image

పండగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేయాలని పండితుల మాట. ‘కొత్త దుస్తులు ధరించి సూర్యుడిని స్మరించుకోవాలి. పితృదేవతలను ఉద్దేశించి దానాలు చేయాలి. ఇష్టదైవానికి పూజ చేసి నైవేద్యం పెట్టిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. ఉదయం సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణుడి వ్రతాలు చేస్తే పుణ్యఫలం దక్కి కోర్కెలు నెరవేరుతాయి. ముఖ్యంగా శక్తిమేర దానం చేస్తే అనేక రెట్ల ఫలితం వస్తుంది’ అని చెబుతున్నారు.

News January 15, 2026

114 రాఫెల్స్‌.. రూ.3.25 లక్షల కోట్ల డీల్‌!

image

భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద ఒప్పందానికి రంగం సిద్ధమవుతోంది. ఫ్రాన్స్‌ నుంచి 114 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు రూ.3.25 లక్షల కోట్ల డీల్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒప్పందంలో భాగంగా 30% స్వదేశీ పార్ట్స్‌తోనే ఇండియాలోనే తయారీకి ప్రణాళికలు రూపొందించారు. ఈ డీల్ ఫిక్స్‌ అయితే భారత్‌లో రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది.