News November 29, 2024
RISHABH PANT: ఒకే ఒక్కడు

BCCI, IPL కాంట్రాక్టుల ద్వారా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఏటా రూ.30 కోట్లు ఆర్జించబోతున్నారు. IPL ద్వారా రూ.27 కోట్లు, BCCI కాంట్రాక్టు ద్వారా రూ.3 కోట్లు సంపాదిస్తారు. వచ్చే ఏడాది A+ గ్రేడ్కు వెళ్తే ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇవే కాక ప్రమోషన్లు, వ్యాపారాలతో పంత్ ఇంకాస్త ఆర్జించనున్నారు. రోహిత్ శర్మ (రూ.23.3 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.28 కోట్లు)కి కూడా ఇంత రాకపోవడం గమనార్హం.
Similar News
News December 7, 2025
చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News December 7, 2025
సోనియా, రాహుల్ సపోర్టర్లను ఈడీ వేధిస్తోంది: డీకే శివకుమార్

నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ED వేధిస్తోందని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ‘మేం పన్నులు కడుతున్నాం. మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది. మమ్మల్ని హింసించడానికే PMLA కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ సపోర్టర్లను వేధించడం, గందరగోళం సృష్టించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. EDకి ఇప్పటికే అన్ని వివరాలు అందజేశానన్నారు.
News December 7, 2025
ఇండిగో సంక్షోభం: గుత్తాధిపత్యమే ముంచిందా?

దేశంలో విమానయాన సంక్షోభానికి ఇండిగో గుత్తాధిపత్యమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండిగో(63%), ఎయిరిండియా(20%) తప్ప మిగతా సంస్థల వాటా నామమాత్రమే. కానీ 2014లో ఇండిగో(31.8%), జెట్ ఎయిర్వేస్(21.7%), ఎయిరిండియా(18.4%), స్పైస్ జెట్(17.4%), గో ఎయిర్(9.2%) ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు ఇండిగోలో సిబ్బంది కొరతతో పరిస్థితి తీవ్రమైంది. అదే మరిన్ని సంస్థలు ఉంటే ఇలా జరిగేది కాదని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.


