News August 7, 2024
నీరజ్ స్వర్ణం గెలిస్తే.. ఫ్యాన్స్‌కు రిషభ్ పంత్ ఆఫర్!

ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా రేపు స్వర్ణం గెలిస్తే ఫ్యాన్స్‌లో ఒకరికి రూ.100089 బహుమతిగా ఇస్తానని క్రికెటర్ రిషభ్ పంత్ ట్విటర్లో ప్రకటించారు. ఆ ట్వీట్‌ను లైక్ చేసి, అత్యధికంగా కామెంట్ చేసిన వారికి అది దక్కుతుందన్నారు. ఇక అత్యధికంగా కామెంట్లు చేసినవారిలో తొలి 10మందికి ఫ్లైట్ టికెట్స్ ఇస్తానని పేర్కొన్నారు. ‘భారత్‌తో పాటు దేశం బయటి నుంచి కూడా నా సోదరుడికి మద్దతు కూడగడదాం’ అని పంత్ పిలుపునిచ్చారు.
Similar News
News December 2, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు సినీ గ్లామర్

TG: ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. తొలి రోజు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తారు. 2వ రోజున మీడియా ఇన్వెస్ట్మెంట్ కార్యక్రమంలో ‘పుష్ప’ స్టార్ డైరెక్టర్ సుకుమార్, ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టి, బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ పాల్గొంటారు. మరికొంతమంది కళాకారులు సమ్మిట్‌లో సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించనున్నారు.
News December 2, 2025
ESIC అంకలేశ్వర్‌లో ఉద్యోగాలు

<
News December 2, 2025
రూపాయి నేల చూపు.. మరింత కనిష్ఠ స్థాయికి!

రూపాయి నేలచూపులు చూస్తోంది. వరుసగా ఐదో సెషన్లోనూ క్షీణించి ఇవాళ రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే 89.874 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోంది. అంతకుముందు All time low 89.895ను తాకి 90కి చేరువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం వరకు రూపాయి పడిపోయింది. అమెరికా డాలర్ బలపడటం, ఇండియా-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఆలస్యమవడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


