News August 17, 2024
జాతీయ అవార్డుపై రిషబ్ కీలక నిర్ణయం

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన జాతీయ అవార్డును రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్‌కి, కన్నడ ఆడియన్స్‌కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ అవార్డు గెలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. హొంబలే ఫిల్మ్స్ ‘కాంతార’ను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
Similar News
News September 17, 2025
హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్కౌంటర్

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.
News September 17, 2025
యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

TG: రాష్ట్రంలో <<17740234>>ఆరోగ్యశ్రీ<<>> సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. 87 శాతం హాస్పిటళ్లు పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుండగా, కేవలం 13 శాతం హాస్పిటళ్లలోనే సేవలు ఆగాయని పేర్కొన్నారు. వైద్య సేవలు కొనసాగించాలని ఆరోగ్యశ్రీ CEO ఉదయ్ కుమార్ మరోసారి ఆయా ఆస్పత్రులకు విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ కింద గత 2 వారాలుగా సగటున రోజుకు 844 సర్జరీలు నమోదవగా ఈరోజు 799 సర్జరీలు నమోదయ్యాయని వెల్లడించారు.
News September 17, 2025
పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.