News January 6, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన రిషి ధావన్

భారత క్రికెటర్ రిషి ధావన్ రిటైర్మెంట్ ప్రకటించారు. విజయ్ హజారే ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న అతడు నిన్న ఆంధ్రాతో మ్యాచ్ అనంతరం పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో 397 రన్స్ చేసి, 11 వికెట్లు పడగొట్టారు. రిషి IND తరఫున 3వన్డేలు, ఒక T20 ఆడారు. IPLలో పంజాబ్, ముంబై, కోల్కతాకు ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News November 25, 2025
రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.
News November 25, 2025
ఈ నెల 28న ఓటీటీలోకి ‘మాస్ జాతర’

రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ‘మాస్ జాతర’ మూవీ OTTలోకి రానుంది. ఈ నెల 28 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
News November 25, 2025
ఏనుగుల సంచార ప్రాంతం ‘వలియాన వట్టం’

శబరిమల యాత్రలో కరిమల కొండను దిగిన తర్వాత భక్తులు చేరే ప్రాంతమే వలియాన వట్టం. ఇది చిన్న కాలువలా నీరు ప్రవహించే ప్రదేశం. ఈ ప్రాంతం ఏనుగుల సంచారానికి ప్రసిద్ధి చెందింది. ఇతర వన్యమృగాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. భద్రత దృష్ట్యా, చీకటి పడే సమయానికి స్వాములు ఈ ప్రాంతం నుంచి త్వరగా వెళ్లిపోయేందుకు సిద్ధమవుతారు. ఈ దారి రాత్రిపూట ప్రయాణానికి సురక్షితం కాదు. <<-se>>#AyyappaMala<<>>


