News July 5, 2024

రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి..

image

బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌(326)ను దాటి 364 సీట్లను కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 77 సీట్లు, లిబరల్ డెమొక్రాట్స్ 48 సీట్లలో గెలిచింది. మరిన్ని ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. ఓటమికి తనదే బాధ్యతని సునాక్ వెల్లడించారు. లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి అభినందించారు. ఇవాళే అధికార మార్పిడి జరుగుతుందన్నారు.

Similar News

News November 23, 2025

HYD: వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది దొరికారు

image

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్& డ్రైవ్‌లో 468 మంది పట్టుబడ్డారు. వాహనాల వారీగా 335 టూవీలర్లు, 25 ఆటోలు, 107 కార్లు, 1 హెవీ వెహికల్ సీజ్ చేశారు. మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే ప్రమాదం జరిగితే BNS సెక్షన్ 105 కింద 10 ఏళ్ల జైలు శిక్ష వర్తిస్తుందని పోలీసులు హెచ్చరించారు. గత వారం 681 కేసులు డిస్పోజ్ కాగా.. 613 మందికి ఫైన్, 50 మందికి ఫైన్+ సర్వీస్, 18 మందికి ఫైన్+ జైలు శిక్ష విధించారు.

News November 23, 2025

రాష్ట్రపతి పరిధిలోకి ‘చండీగఢ్’?: స్పందించిన కేంద్రం

image

పంజాబ్, హరియాణాల సంయుక్త రాజధాని చండీగఢ్‌పై చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతికి ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలన దశలోనే ఉందని కేంద్రం వెల్లడించింది. ఈ శీతాకాల సమావేశాల్లో దీనిపై బిల్లు ఉండదని స్పష్టం చేసింది. కాగా ఈ ప్రపోజల్‌ను ఆప్, అకాలీదళ్, INC సహా పంజాబ్ BJP తీవ్రంగా వ్యతిరేకించాయి. కాగా ప్రస్తుతం ఉమ్మడి రాజధానిపై పంజాబ్ గవర్నర్‌కు పాలనాధికారం ఉంది.

News November 23, 2025

విత్తనాలు కొంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. విత్తనాలను లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి. సరైన సీలుతో మరియు ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి. విత్తన రకం, లాట్ నంబర్, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి. కొనుగోలు రశీదు తప్పక తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్ సంతకం తప్పక ఉండాలి.