News April 2, 2024
పెరుగుతున్న ఎండలు.. ప్రభుత్వం అప్రమత్తం

TG: ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా చర్యలు ముమ్మరం చేస్తోంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ORS ప్యాకెట్లు, IV ఫ్లూయిడ్స్, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేసింది. ఇవి ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.
Similar News
News January 21, 2026
రాజాసాబ్ ఫెయిల్యూర్‌కి అదే కారణం: తమ్మారెడ్డి

ప్రభాస్ ‘రాజాసాబ్’ను రూ.100 కోట్లతో రీజినల్ ఫిల్మ్‌గా తీసుంటే లాభాలు వచ్చేవని సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. ‘ఈ మూవీని తొలుత తక్కువ బడ్జెట్‌లో తెలుగులో తీయాలనుకున్నారు. తర్వాత పాన్ ఇండియా ఆలోచనతో పదే పదే స్క్రిప్ట్ మార్చారు. దీంతో మొదట అసలు కథ తెరకెక్కలేదు. మేకర్స్‌కు పాన్ ఇండియా ఆలోచన వస్తే చేసే మార్పులు కొన్నిసార్లే సక్సెస్ ఇస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.
News January 21, 2026
స్మార్ట్ ఫోన్ యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్!

గూగుల్ ఫొటోస్ యాప్‌లో మీడియా ఫైల్స్ బ్యాకప్ చేసినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఎక్కువగా అయిపోతుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే సింకింగ్, ఆపరేషన్సే దీనికి కారణం. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ యాప్‌లో త్వరలో ‘ఆప్టిమైజ్ బ్యాకప్ ఫర్ బ్యాటరీ లైఫ్’ అనే ఫీచర్ రానుంది. ఇది అనవసరమైన సింకింగ్‌ను తగ్గించి బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది. యాప్ ఓపెన్ చేసినప్పుడు లేదా ఫోన్ వాడనప్పుడు మాత్రమే బ్యాకప్ జరుగుతుంది.
News January 21, 2026
ఇది డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది: రోహిత్

టీ20 WCని ఈసారి ఇంట్లో కూర్చొని చూడటం తనకు స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుందని రోహిత్ శర్మ అన్నారు. 2007 నుంచి 2024 వరకు అన్ని టీ20WCలలో తాను ఆడానని, ఈసారి స్టేడియంలో ఎక్కడో కూర్చొని లేదా ఇంటి నుంచి చూడటం డిఫరెంట్‌గా ఉంటుందన్నారు. గతంలో WCకి ముందు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తుచేసుకున్నారు. స్క్వాడ్‌లో ఉన్న 15 మందిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు.


