News February 26, 2026

RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>RITES<<>> లిమిటెడ్‌ 9 ఇండివిడ్యువల్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, పీజీ (సివిల్ ఇంజినీరింగ్), ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. మార్చి 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rites.com

Similar News

News February 27, 2026

సెమీస్‌పై కివీస్ కన్ను

image

T20 WCలో ఇవాళ సా.7 గంటలకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గ్రూప్-2 నుంచి ENG ఇప్పటికే సెమీస్ చేరగా రెండో బెర్త్ ఖాయం చేసుకోవాలని శాంట్నర్ టీమ్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే కివీస్ నేరుగా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఓడితే రేపటి శ్రీలంక-పాక్ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. లంకపై పాక్ భారీ తేడాతో గెలిస్తే కివీస్‌ సెమీస్ ఆశలు క్లిష్టమవుతాయి.

News February 27, 2026

రైల్వే టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చొచ్చు!

image

కన్ఫర్మ్ అయిన రైలు టికెట్‌పై ప్రయాణించే వ్యక్తి పేరును మార్చుకునే వెసులుబాటును రైల్వే కల్పిస్తోంది. మీ టికెట్‌ను మీ నాన్న, అమ్మ, బ్రదర్, సిస్టర్, కొడుకు, కూతురు లేదా భార్యాభర్తల పేరు మీదకు మార్చుకోవచ్చు. దీనికోసం ప్రయాణానికి 24 గంటల ముందే టికెట్, ID ప్రూఫ్‌తో రిజర్వేషన్ ఆఫీసర్‌ను కలవాలి. ప్రభుత్వ ఉద్యోగులు, స్టూడెంట్స్, పెళ్లి బృందాలకు కూడా ఈ ఛాన్స్ ఉంది. ఈ మార్పు ఒక్కసారి మాత్రమే కుదురుతుంది.

News February 27, 2026

అధిక యూరియాతో పంటకు కలిగే నష్టాలు

image

చాలా మంది రైతులు ఎక్కువ దిగుబడి వస్తుందని పంటకు అధికంగా యూరియా వేస్తున్నారు. సిఫార్సుకు మించి వేసిన యూరియా ఒకేసారి నీటిలో కరిగిపోతుంది. 2-3 రోజుల్లో పంట కొంత వరకు మాత్రమే తీసుకోగలుగుతుంది. మిగిలింది వృథాగా భూమి లోపలి పొరల్లోకి, ఆవిరి రూపంలో గాలిలో కలిసిపోతుంది. దీని వల్ల ఎరువు నష్టంతో పాటు పంటను ఎక్కువగా పురుగులు, తెగుళ్లు ఆశించి బలహీన పరుస్తాయి. కాబట్టి నిపుణుల సిఫార్సు మేరకే యూరియా వేసుకోవాలి.