News January 26, 2026

RITES లిమిటెడ్‌లో 18 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

RITES లిమిటెడ్‌లో 18 ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BE/BTech, ME/MTech, MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.40,000-రూ.2,80,000 వరకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.600, SC, ST, PwBD, EWSలకు రూ.300. వెబ్‌సైట్: rites.com/

Similar News

News February 5, 2026

మున్సి‘పోల్స్’లో సోషల్ మీడియా వార్

image

TG: మున్సి‘పోల్స్’ ప్రచారాలు సోషల్ మీడియా వేదికగా మార్మోగుతున్నాయి. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు SMనూ ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను INC మంత్రులకు, BRS నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు అప్పగించాయి. వీరి వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు సూచించాయి.

News February 5, 2026

మచ్చల్ని తగ్గించే జాజికాయ ఫేస్‌ప్యాక్

image

జాజికాయని వాడడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గడమే కాదు. మొటిమలు కూడా రాకుండా ఉంటాయంటున్నారు నిపుణులు. 2 టీ స్పూన్ల జాజికాయ పొడి, తేనె, పాలు కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత ఫేస్‌ప్యాక్‌ని క్లీన్ చేయండి. ఇలా చేస్తే ముఖం బ్రైట్‌గా కనిపిస్తుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. దీని వల్ల ముఖంపై పేరుకుపోయిన అదనపు నూనె కూడా తొలగిపోతుందంటున్నారు.

News February 5, 2026

మోదీపై దాడికే మహిళా ఎంపీల మోహరింపు: BJP MP

image

నిన్న లోక్‌సభ అర్ధాంతరంగా వాయిదాపడి PM మోదీ ప్రసంగం రద్దవడం తెలిసిందే. అయితే దీనికి కారణం మోదీ కూర్చున్న సీటు చుట్టూ తమ మహిళా MPలను విపక్షం మోహరించడమేనని NDTV పేర్కొంది. నరవణే పుస్తకంపై రాహుల్‌ను అనుమతించకపోవడంతో విపక్షం యుద్ధమార్గంలో వెళ్తున్నట్టుగా ఉందని విశ్లేషించింది. కాగా మోదీపై దాడి చేసేందుకే తమ మహిళా ఎంపీలను PM సీటు వద్ద విపక్షం మోహరించిందని BJP ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.