News February 25, 2025

RJY: ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలి

image

పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Similar News

News March 25, 2025

రాజమండ్రిలో జంట హత్యలు.. అసలేం జరిగిందంటే.!

image

రాజమండ్రిలో జంట హత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. DSP శ్రీవిద్య ఈ కేసులో కీలక విషయాలు వెల్లడించారు. శ్రీకాకుళానికి చెందిన శివకుమార్, సుమియా లవర్స్. తండ్రి మృతిచెందగా ఆమె తల్లి సాల్మాతో రాజమండ్రిలో ఉంటోంది. సుమియా వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతోందని శివ గొడవపడ్డాడు. ఆదివారం సుమియా మేడపైకి వెళ్లగా.. పడుకొని ఉన్న తల్లిని కత్తితో చంపేసి, తలుపు వెనుక ఉండి కూతురినీ చంపేశాడు. నిందితుడు అరెస్టయ్యాడు.

News March 25, 2025

పెరవలి : చికెన్ కోసం వెళ్లి ఇద్దరు మృతి

image

అన్నవరప్పాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టి , పిట్టల వేమవరం గ్రామానికి చెందిన మాకా సురేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హనుమంతు కూడా కన్నుమూశాడు. అయితే వారు ఇరువురూ చికెన్ కోసం అన్నవరప్పాడుకు వెళ్లినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై ఎస్సై వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

News March 25, 2025

హుకుంపేట : తల్లీ కుమార్తె హత్య.. డీఎస్పీ ఏమన్నారంటే..!

image

హుకుంపేట డిబ్లాకుకు చెందిన తల్లీ కుమార్తెలు ఎండీ సల్మాన్, ఎండీ సానియా మర్డర్ కేసులో ముద్దాయి శివకుమార్‌ను కొవ్వూరు రూరల్‌ పోలీసులు అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి ఈస్ట్‌ జోన్‌ డీఎస్పీ బి.విద్య తెలిపారు. బొమ్మూరు ఇన్‌స్పెక్టర్‌ కాశీవిశ్వనాథ్‌ నిందితుడిని పట్టుకున్నారన్నారు. యువతి వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందని అది సహించకే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

error: Content is protected !!