News March 31, 2025

RJY: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు.

Similar News

News October 29, 2025

మంచిర్యాల: హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు శిక్ష

image

భీమారం మండలంలో హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు జైలు శిక్ష విధించింది. శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపిన వివరాలు.. శంకరమ్మ అనే మహిళపై సమ్మయ్య,లింగయ్య అనే నిందితులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు తరలించారు. మంచిర్యాల అదనపు సహాయ సేషన్స్ న్యాయమూర్తి రామ్మోహన్ రెడ్డి సాక్షుల వాంగ్మూలాలు,ఆధారాలు పరిశీలించి మంగళవారం తీర్పు వెలువరించారు.

News October 29, 2025

ఎచ్చెర్ల: నేడు అంబేడ్కర్ యూనివర్సిటీ సెలవు

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో ఎచ్చెర్ల డా.బీ.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీకి బుధవారం కూడా సెలవును పొడిగించారు. జిల్లాలో వర్షాలు నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు యూనివర్సిటీతో పాటు జిల్లాలో అనుబంధ ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డా.బీ.అడ్డయ్య మంగళవారం వెల్లడించారు. తుఫాన్ నేపథ్యంలో విద్యార్థులు భద్రత దృష్ట్యా సెలవును ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

News October 29, 2025

GNT: ‘ఇన్‌స్టా’ పరిచయం.. గర్భం దాల్చిన బాలిక

image

గుంటూరు పట్టాభిపురం పోలీసులు ఒక మైనర్ బాలుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఒకే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దీంతో కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వారు దగ్గరయ్యారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడంతో, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికను చికిత్స నిమిత్తం GGH ఆసుపత్రికి తరలించారు.