News March 22, 2025
RJY: రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు

సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్, అసభ్యకరమైన, అనైతిక, కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలలో పోస్టులు ఉన్నాయని గుర్తిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా ఏ విధమైన పోస్ట్లు పెట్టొద్దని ఎస్పీ హితవు పలికారు.
Similar News
News March 26, 2025
అనపర్తి: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులు

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి తమ కోరిక తీర్చాలని బెదిరించిన ఇద్దరూ వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై శ్రీను నాయక్ మంగళవారం తెలిపారు. అనపర్తి మండలం పీరా రామచంద్రపురానికి చెందిన మణికంఠ రెడ్డి, రామకృష్ణారెడ్డి ఓ వివాహిత స్నానం చేస్తుండగా వీడియో తీసి, తమ కోరిక తీర్చాలని, రూ.1లక్ష ఇవ్వాలని ఆమెను బెదిరించారు. దీంతో ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News March 26, 2025
ఉపసర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: జేసీ

జిల్లాలో 12 గ్రామాలలో ఈ నెల 27న ఉప సర్పంచ్ల, బిక్కవోలు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు, పెరవలి, రంగంపేటల రెండు కో-ఆప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఆ మేరకు అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సమన్వయ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
News March 25, 2025
కొంతమూరు: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి

కొంతమూరు హైవే సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల (45) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నివాసి అయిన పాస్టర్ రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి వ్యక్తిగత పనులు నిమిత్తమై బైక్పై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. దీంతో నగరంలో ఉన్న పాస్టర్లు అందరూ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి చేరుకున్నారు.