News February 23, 2025
RJY: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటాన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్‌పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.
Similar News
News December 19, 2025
రాజమండ్రి: పల్స్ పోలియోకు ఏర్పాట్లు పూర్తి- DMHO

ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని DMHO డా. కె.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాలోని 0–5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఒక విడత పోలియో చుక్కలు వేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 1,89,550 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని చేపట్టగా, ఇందుకు 2,31,250 డోసుల పోలియో వ్యాక్సిన్ సిద్ధం చేశామన్నారు.
News December 19, 2025
కాకినాడలో పార్టీ పటిష్ఠతకు జ్యోతుల కృషి: లోకేశ్

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాకినాడ జిల్లా టీడీపీ పగ్గాలు చేపట్టి పార్టీని విజయతీరాలకు నడిపించిన వ్యక్తి జ్యోతుల నవీన్ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటించేందుకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు పలువురు టీడీపీ నాయకులతో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నవీన్ స్వాగతం పలికారు.
News December 19, 2025
రాజమండ్రికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు.


