News March 31, 2025

RJY: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు.

Similar News

News April 3, 2025

MDK: కలెక్టర్ జాయిన్ చేసిన బాలిక అదృశ్యం..?

image

పాపన్నపేట కేజీబీవీ నుంచి బాలిక అదృశ్యమైంది. మెదక్ బాలసదనంలో అనాథగా ఉన్న ఓ బాలికను కలెక్టర్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయగా అక్కడి నుంచి బాలిక వెళ్లిపోయినట్లు తెలిసింది.

News April 3, 2025

జిల్లాకు 4,549 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

image

జిల్లాలో 4,549 ఇందిరమ్మ ఇళ్ల మంజూరయ్యాయని కలెక్టర్ తేజస్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎంపీడీవోలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అర్హత ఉన్నవారికి ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జరిగిన పనుల వివరాలు, మిగిలిన నిధులను నివేదిక ద్వారా సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News April 3, 2025

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు వడివడిగా ఏర్పాట్లను పూర్తి చేశామని దేవస్థాన ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. కరోనా తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు, ఉన్నత అధికారులు, న్యాయమూర్తులు ఇతర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

error: Content is protected !!