News March 30, 2025
RKP: అమ్మాయి కోసం యువకుడి సూసైడ్

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్లో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. అబ్రహంనగర్కి చెందిన వినయ్(26) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకు ఆమెతో పెళ్లి చేయాలని తల్లికి చెప్పడంతో ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని వినయ్ తల్లి సముదాయించింది. కాగా, తనకు ఉద్యోగం లేకపోవడంతో ఆ అమ్మాయిని ఎలా పోషించాలని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
Similar News
News November 18, 2025
రోడ్డుపై అడ్డంగా క్యూలైన్.. రాజన్న భక్తుల పాట్లు

వేములవాడ రాజన్న దర్శనాలను భీమేశ్వరాలయంలోకి మార్చినప్పటి నుంచి భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భీమన్న ఆలయంలోకి వెళ్లడానికి పార్వతిపురం వెనుక నుంచి కొత్త క్యూలైన్ నిర్మించారు. నటరాజ్ విగ్రహం ముందు ఈ క్యూలైన్ను రోడ్డుపై అడ్డంగా నిర్మించడంతో ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడానికి రోడ్డు దాటే మార్గం లేకపోవడంతో కొంతమంది మహిళా భక్తులు సోమవారం రాత్రి క్యూలైన్లపైకి ఎక్కి మరీ దాటడాన్ని పై ఫొటోలో చూడొచ్చు.

టెక్నాలజీతో ఉత్తమ ఫలితాలు.. జర్మనీ సదస్సులో జిల్లా రైతులు

టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయంలో ఉత్తమమైన ఫలితాలు సాధించవచ్చు అని మామిడిపెల్లికి చెందిన రైతులు నోముల వేణుగోపాల్ రెడ్డి, మోకిడె శ్రీనివాస్, నాగారానికి చెందిన దుంపేట నాగరాజు తమ అనుభవాలను వివరించారు. ACRAT ప్రాజెక్టులో భాగంగా జర్మనీలో ఐదు రోజుల వ్యవసాయ సదస్సులో రాష్ట్రానికి చెందిన 12 మంది సభ్యుల బృందంతో కలిసి పాల్గొన్న వీరు తమ క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.