News March 26, 2025
RKP: యువకుడిపై పోక్సో కేసు నమోదు: SI

రామకృష్ణాపూర్‌కు చెందిన బాలిక(10) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ధృవకుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటుపడ్డ యువకుడు నీటి సీసా కోసం వచ్చిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.
Similar News
News January 3, 2026
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: కలెక్టర్

విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపనతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. శనివారం నంద్యాలలోని బొమ్మల సత్రం సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ సందర్శించారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదో తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్‌ను స్వయంగా పరిశీలించి పాఠ్యాంశాలపై విద్యార్థులతో ముచ్చటించారు.
News January 3, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు:
* బంగారం 24 క్యారెట్ల 10 గ్రాము ధర: రూ.1,38,350
* బంగారం 22 క్యారెట్ల 10 గ్రాము ధర: రూ.1,27,280
* వెండి 10 గ్రాముల ధర: రూ.2,380.
News January 3, 2026
కేసీఆర్ వదిలిన రాజకీయ బాణం కవిత: కోమటిరెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ వదిలిన రాజకీయ బాణంగా కవిత వ్యవహరిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలను దూరం చేసేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. కవిత అసలు బీఆర్ఎస్లో ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై విమర్శలకే స్పందిస్తున్న ఆమె.. హరీశ్‌రావుపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని మంత్రి ప్రశ్నించారు.


