News March 30, 2025

RKP: అమ్మాయి కోసం యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్‌లో జరిగింది. ఎస్ఐ రాజశేఖర్ వివరాల ప్రకారం.. అబ్రహంనగర్‌కి చెందిన వినయ్(26) ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. తనకు ఆమెతో పెళ్లి చేయాలని తల్లికి చెప్పడంతో ఉద్యోగం వచ్చాక పెళ్లి చేస్తానని వినయ్ తల్లి సముదాయించింది. కాగా, తనకు ఉద్యోగం లేకపోవడంతో ఆ అమ్మాయిని ఎలా పోషించాలని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

Similar News

News February 23, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 23, 2026

జనగామ జిల్లాలో క్షుద్రపూజల కలకలం

image

పాలకుర్తి మండలంలోని గుడికంటతండాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సర్పంచ్ మహేందర్ ఇంటి ఎదుట గుర్తుతెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి పూజలు నిర్వహించారు. ఇంటి ముందు కోడిగుడ్లు, మిరపకాయలు, నిమ్మకాయలతో భీతిగొల్పేలా ముగ్గులు వేయడంతో సర్పంచ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.