News March 26, 2025

RKP: యువకుడిపై పోక్సో కేసు నమోదు: SI

image

రామకృష్ణాపూర్‌‌కు చెందిన బాలిక(10) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ధృవ‌కుమార్ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. సెల్‌ఫోన్‌లో అశ్లీల చిత్రాలు చూడడానికి అలవాటు‌పడ్డ యువకుడు నీటి సీసా కోసం వచ్చిన బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు.

Similar News

News February 24, 2026

LIC, మ్యూచువల్ ఫండ్స్‌కు ఐటీ స్టాక్స్ షాక్!

image

దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ స్టాక్స్ పతనం మ్యూచువల్ ఫండ్స్, LICపై ప్రభావం చూపిస్తోంది. ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన LIC రెండు నెలల్లో ₹42,500కోట్లు నష్టపోయింది. ఇన్ఫోసిస్, TCSలో పెట్టుబడులు ద్వారా ₹26,510కోట్లు కోల్పోయింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్‌కు కూడా ఐటీ షాక్ గట్టిగా తగిలింది. ఈ ఏడాదిలో ₹3.5లక్షల కోట్లను కోల్పోయాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్ ద్వారా దాదాపు ₹2లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

News February 24, 2026

కేసుల పరిష్కారంలో సాంకేతికతను వాడాలి: ఎస్పీ

image

జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి మంగళవారం భీమవరం ఆయన కార్యాలయంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో నెలవారీ నేర సమీక్ష చేపట్టారు. దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ విధానాన్ని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. నిర్దేశిత కాలపరిమితిలో ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని, మార్చి 14న జరిగే లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News February 24, 2026

పచ్చిమేత పాడి పశువులకు ఎందుకు అవసరం?

image

పచ్చి మేతలో విటమిన్-A అధికంగా ఉంటుంది. దీని వల్ల పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉండి సకాలంలో యుక్త వయసుకు వచ్చి యద లక్షణాలు చూపించి చూలు కడతాయి. రైతు తనకున్న పొలంలో 1/10 వంతులో పశుగ్రాసాన్ని సాగు చేస్తే పశువుల పోషణ ఖర్చు 25-30 శాతం తగ్గి.. పాల నుంచి వచ్చే ఆదాయం 20-30% వరకు పెరుగుతుంది. పచ్చిమేత వల్ల పశువుల జీర్ణక్రియ మెరుగ్గా జరిగి పోషకాలు బాగా అంది పాల దిగుబడి కూడా పెరుగుతుంది.