News October 14, 2025

RMG: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు: కమిషనర్లు

image

సింగరేణి రామగుండం-3 ఏరియాలో సీఎంపీఎఫ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రీజినల్ కమిషనర్లు హరిపచౌరి, డా.కె. గోవర్ధన్ మాట్లాడుతూ.. సీఎంపీఎఫ్ సేవలు ఇప్పుడు పూర్తిగా C-CARES పోర్టల్ ద్వారా పారదర్శకంగా అందుతున్నాయని తెలిపారు. 355 రివైజ్డ్ పెన్షన్ ఆర్డర్లను GM నరేంద్ర సుధాకరరావుకు అందజేశారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా జీరో పెండింగ్ లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 14, 2025

భద్రాద్రి: నేతాజీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేతాజీ రామవరం క్యాంపస్‌లోని 100 మంది విద్యార్థుల హాస్టల్ భవనాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మంగళవారం సందర్శించారు. హాస్టల్‌ వినియోగానికి అవకాశాలు పరిశీలించి, ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు.

News October 14, 2025

NRPT: విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు: ఉప ముఖ్యమంత్రి

image

బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. పాఠశాలల్లో అందిస్తున్న భోజనం, సౌకర్యాలను ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

News October 14, 2025

VKB: రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలి

image

వికారాబాద్ జిల్లాలో రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మద్దతు ధర పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ చెప్పారు.