News March 17, 2025
RMP వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం?

RMP వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బండి ఆత్మకూరు(M) కడమల కాల్వకు చెందిన ఓ మహిళను RMP లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే విషయమై ఫిబ్రవరిలో బండి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసు వాపస్ తీసుకోవాలంటూ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి RMP వేధించడంతో మహిళ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని బంధువులు తెలిపారు.
Similar News
News February 26, 2026
మెదక్: రూ.2.71 లక్షల టాక్స్ చెల్లించిన ఆర్టీసీ

మెదక్ ఆర్టీసీ డిపోకు సంబంధించిన ప్రాపర్టీ టాక్స్ రూ. 2,71,801 చెక్కును డిపో మేనేజర్ సురేఖ బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని కోరారు. ఈ నిధులతో పట్టణంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
News February 26, 2026
బాధ్యతలు స్వీకరించిన పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ మల్లయ్య

మున్సిపల్ కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ళ మల్లయ్య బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పట్టణ ప్రగతికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
News February 26, 2026
పేటెంట్ ఎక్స్‌పైరీ.. తగ్గనున్న వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ధరలు!

భారత్‌లో వెయిట్ లాస్ ఇంజెక్షన్ల ధరలు తగ్గనున్నాయి. వీటిలో వినియోగించే సెమాగ్లుటైడ్ పేటెంట్ MAR 20తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో దీని జనరిక్ వెర్షన్ తెచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్, సన్‌ఫార్మా వంటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం నోవోనార్‌డిస్క్ సంస్థకు చెందిన Wegovy, Ozempicలలో సెమాగ్లుటైడ్ వినియోగిస్తున్నారు. వీటి ధర ₹8వేల నుంచి ₹25వేల వరకూ ఉంది. జనరిక్ వెర్షన్ వస్తే ధర 50% వరకూ తగ్గనుంది.


