News March 17, 2025

RMP వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం?

image

RMP వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. బండి ఆత్మకూరు(M) కడమల కాల్వకు చెందిన ఓ మహిళను RMP లైంగికంగా వేధిస్తున్నాడు. ఇదే విషయమై ఫిబ్రవరిలో బండి ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. కేసు వాపస్ తీసుకోవాలంటూ తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి RMP వేధించడంతో మహిళ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిందని బంధువులు తెలిపారు.

Similar News

News February 28, 2026

ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

image

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.

News February 28, 2026

సామాన్య భక్తులకు వీఐపీ సౌకర్యాలు: అడ్లూరి

image

2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసారి 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ.940 కోట్లతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, నిరంతర విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.సామాన్య భక్తులకు కూడా వీఐపీ స్థాయి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

News February 28, 2026

టీటీడీ పూర్తి ఈవోగా ముద్దాడ రవిచంద్ర

image

AP ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.ఆర్.టి. నం.494 ప్రకారం ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ముద్దాడ రవిచంద్రను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పూర్తి బాధ్యతగా అప్పగించింది. అయితే జి.సాయి ప్రసాద్‌కు వాటర్ రిసోర్సెస్, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ముద్దాడ రవిచంద్ర టీటీడీ పూర్తి బాధ్యతలను స్వీకరించన్నారు.