News March 30, 2024
ఆర్ఎంపీలు అర్హత లేకుండా వైద్యం చేయొద్దు: వైద్యారోగ్యశాఖ

TG: RMPలు అర్హత లేకుండా వైద్యం చేయొద్దని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోకూడదని ఆదేశించింది. రోగ నిర్ధారణ చేసి మందులివ్వడం, ఇంజెక్షన్లు వేయడం, సెలైన్ ఎక్కించడం, అబార్షన్లు, కాన్పులు చేయడం, ప్రిస్క్రిప్షన్ రాయడం వంటివి చేయకూడదని తెలిపింది. సూచిక బోర్డులపై ప్రథమ చికిత్స కేంద్రం అని పెట్టుకోవాలని సూచించింది.
Similar News
News April 10, 2026
డ్రంకెన్ డ్రైవ్ చేశారని పోలీసులు వాహనాన్ని సీజ్ చేయకూడదు: హైకోర్టు

TG: మద్యం తాగి వాహనం నడిపినంత మాత్రాన ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే లేదా సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. వాహనదారుడు మత్తులో ఉంటే, అతడి బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించి వాహనాన్ని అప్పగించాలని సూచించింది. ఒకవేళ ఎవరూ లేకపోతే మాత్రమే తగిన జాగ్రత్తలతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించాలని పేర్కొంది.
News April 10, 2026
5,000 మంది ఇరాన్ సైనికులు హతం: ఇజ్రాయెల్

40 రోజులపాటు కొనసాగిన యుద్ధంలో ఇరాన్‌లోని 4వేల టార్గెట్లపై 10,800 దాడులు చేసినట్లు IDF వెల్లడించింది. దాడి మొదటి రోజే కేవలం 40 సెకన్లలో సుప్రీం లీడర్ ఖమేనీ సహా 40 మందిని హతమార్చినట్లు తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఇరానియన్ సైనికులు చనిపోయినట్లు అంచనా వేసింది. 85 శాతం డిఫెన్స్ వ్యవస్థలను నాశనం చేసినట్లు పేర్కొంది. ఇక ఇజ్రాయెల్‌పై ఇరాన్ 650 మిస్సైళ్లను వేయగా 24 మంది చనిపోయినట్లు సమాచారం.
News April 10, 2026
ఆర్టీసీ భూములు సరే.. గీతం సంగతేంటి: YCP

AP: విజయవాడ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన RTC భూములను చంద్రబాబు కమీషన్ తీసుకొని లులూకు కట్టబెట్టారని YCP ఆరోపించింది. ఈ అక్రమ భూకేటాయింపులపై తాము చేసిన పోరాటానికి దెబ్బకి దిగొచ్చి కేటాయింపులను రద్దు చేసుకున్నారని తెలిపింది. RTC భూములు సరే, విశాఖలో గీతం యూనివర్సిటీకి కట్టబెట్టిన రూ.5వేల కోట్ల విలువైన భూముల సంగతేంటి CBN? అని ప్రశ్నించింది. ఆ కేటాయింపులను ఎప్పుడు రద్దు చేస్తారు? అని ట్వీట్ చేసింది.


