News November 30, 2025
RO-KO కంబ్యాక్.. ఎనీ డౌట్స్?

2027 ODI వరల్డ్ కప్ వరకు రోహిత్, విరాట్ కొనసాగగలరా అనే డౌట్స్ రాంచీ వేదికగా SAతో జరుగుతున్న తొలి వన్డేతో దాదాపు క్లియర్ అయిపోయాయి. రోహిత్ మెరుపు అర్ధశతకం (51 బంతుల్లో 57)తో సమాధానం చెప్పగా, కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగుల(11 ఫోర్లు, 7 సిక్సర్లు)తో తన పవర్ చూపించారు. ఈ జోడీ 136 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. అభిమానులలోని సందేహాలను దూరం చేసింది. RO-KO కంబ్యాక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.
Similar News
News April 8, 2026
సీజ్‌ఫైర్.. ట్విస్ట్ ఇచ్చిన నెతన్యాహు

ఇరాన్‌తో అమెరికా సీజ్‌ఫైర్‌ను స్వాగతించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ ట్విస్ట్ ఇచ్చారు. ఈ రెండు వారాల సీజ్‌ఫైర్ లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు. మరోవైపు సీజ్‌ఫైర్ లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ అంతకుముందు ప్రకటించారు. కాగా ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు లెబనాన్‌లో దాదాపు 1,500 మంది మరణించారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.
News April 8, 2026
ఇరాన్‌లో US పైలట్‌ను కనిపెట్టిన ‘ఘోస్ట్ మర్మర్’

ఇరాన్‌లో F-15E <<19570876>>పైలట్‌ను కాపాడటానికి<<>> US CIA ‘ఘోస్ట్ మర్మర్’ అనే టెక్నాలజీని వాడింది. ఇది కొన్ని KM దూరం నుంచి మనిషి గుండె చప్పుడును పసిగడుతుంది. మనిషి గుండె కొట్టుకున్నప్పుడు బాడీ నుంచి తక్కువ స్థాయిలో విద్యుదయస్కాంత కిరణాలు రిలీజ్ అవుతాయి. ‘క్వాంటం మాగ్నెటోమెట్రీ’ టెక్నాలజీని వాడే ‘ఘోస్ట్ మర్మర్’ ఆ వీక్ సిగ్నల్స్‌ను పసిగడుతుంది. AI సాయంతో చుట్టుపక్కల నాయిస్ నుంచి గుండె చప్పుడును వేరు చేస్తుంది.
News April 8, 2026
ఎన్టీఆర్-నీల్ మూవీపై రూమర్లను నమ్మొద్దు: నిర్మాతలు

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాపై వస్తున్న రూమర్లను నిర్మాతలు ఖండించారు. షెడ్యూల్ క్యాన్సిల్ కాలేదని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ స్పష్టం చేశాయి. సాధారణంగా ప్రిపరేషన్ గ్యాప్ వచ్చిందని, ప్లాన్ ప్రకారం మూవీ షూటింగ్ జరుగుతోందని పేర్కొన్నాయి. చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనలన్నీ తామే వెల్లడిస్తామని తెలిపాయి.


