News March 17, 2024

గిద్దలూరులో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

image

రహదారి ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలో యోగానంద స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వీరిద్దరూ పోతవరం గ్రామానికి చెందిన వ్యక్తులుగా స్థానికులు గుర్తించారు. పని నిమిత్తం గిద్దలూరు వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Similar News

News January 5, 2026

కనిగిరి: మహిళను హత్య చేసి.. ప్రియుడి సూసైడ్

image

వెలిగండ్ల(M) కట్టకిందపల్లిలో సోమవారం వివాహిత హత్యకు గురైన విషయం తెలిసిందే. DSP సాయి ఈశ్వర్ వివరాల ప్రకారం.. అద్దంకికి చెందిన సీనావలి కట్టకిందపల్లికి చెందిన నాగజ్యోతికి వివాహేతర సంబంధం ఉండగా సోమవారం సీనావలి ఆమెతో <<18769740>>గొడవపడి హత్య<<>> చేశాడు. గ్రామస్థులకు బయపడి సీనావలి కూడా విష ద్రావణం తాగడంతో కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడన్నారు. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News January 5, 2026

కనిగిరి వద్ద మహిళ దారుణ హత్య.!

image

మార్కాపురం జిల్లా వెలిగండ్ల మండలం కట్టకిందపల్లి గ్రామంలో సోమవారం ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విచారణ చేపట్టామని మరన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని SI కృష్ణ పావని తెలిపారు. హత్యకు గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2026

మార్కాపురం కొత్త జిల్లా.. కాకమీదున్న పాలిటిక్స్!

image

మార్కాపురం జిల్లాలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. జిల్లాలో అంతర్భాగమైన Y పాలెం పాలిటిక్స్ హీట్ పీక్స్‌కు చేరింది. MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రొటోకాల్ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలపై టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఆయన ఇన్‌ఛార్జ్‌‌గా ఉన్న సమయంలో ప్రొటోకాల్ గుర్తులేదా అంటూ ఎరిక్షన్ బాబు ప్రశ్నించారు. ఇలా వీరి మధ్య విమర్శల జోరు ఊపందుకుంది.