News March 17, 2024

కొణిజర్లలో రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి

image

ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొనిజర్లలో జరిగింది. కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మల్లుపల్లికి చెందిన ఉపేందర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News January 24, 2026

రేపు ఖమ్మానికి YSRCP అధికార ప్రతినిధి శ్యామల

image

YSRCP రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా నమోదైన కేసుల్లో జైలుకు వెళ్లి, ఇటీవల విడుదలైన పార్టీ కార్యకర్తలను ఆమె పరామర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు నగరంలోని వైఎస్సార్ కాలనీలో బాధితులను పరామర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి YSRCP శ్రేణులు, జగన్ అభిమానులు తరలిరావాలని పార్టీ ప్రతినిధులు కోరారు.

News January 24, 2026

రైతులకు ఊరట.. జిల్లాకు 1,789 టన్నుల యూరియా

image

ఖమ్మం జిల్లాకు యూరియా నిల్వలు చేరాయి. చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌కు చేరిన 1,789 టన్నుల యూరియా పంపిణీని టెక్నికల్ ఏవో పవన్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. మొత్తం 3,189 టన్నుల నిల్వల్లో ఖమ్మానికి సింహభాగం కేటాయించగా, మిగిలినవి పొరుగు జిల్లాలకు పంపారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని, పంపిణీ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 23, 2026

ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ‘నా భారతదేశం – నా ఓటు’ అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.