News January 29, 2025
సౌదీలో రోడ్డు ప్రమాదం.. 9 మంది భారతీయులు మృతి

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిజన్లో జరిగిన ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించినట్లు జెడ్డాలోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది. అధికారులతో టచ్లో ఉన్నామని మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది. ఘటనపై విదేశాంగ శాఖ విచారం వ్యక్తం చేసింది.
Similar News
News October 27, 2025
ఈ జిల్లాల్లో కాలేజీలకు సెలవు

AP: తుఫాను నేపథ్యంలో స్కూళ్లతో పాటు పలు జిల్లాల్లోని జూనియర్ ఇంటర్ కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కాలేజీలకు ఈ నెల 29 వరకు సెలవులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కడప జిల్లాల్లో రేపు హాలిడే ఉండనుంది. కాకినాడలో 31 వరకు సెలవులు ప్రకటించారు. మిగతా జిల్లాల్లో యథావిధిగా కాలేజీలు నడవనున్నాయి.
News October 27, 2025
₹5500 కోట్ల ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

‘ఆత్మనిర్భరత్’ సాధనలో ₹5500 కోట్లతో చేపట్టే 7 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి వల్ల రానున్న కాలంలో రూ.20వేల కోట్లమేర దిగుమతి వ్యయం తగ్గుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. Kaynes Syrmaతోపాటు మరో మూడు గ్రూపులు రూ.వేల పెట్టుబడులతో ముందుకొచ్చాయన్నారు. కాగా ₹1.15 లక్షల కోట్లతో ప్రతిపాదనలు అందినట్లు ఎలక్ట్రానిక్స్ & IT కార్యదర్శి కృష్ణన్ తెలిపారు.
News October 27, 2025
వాస్తు పాటిస్తే సిరులు సొంతమవుతాయా?

వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే సరిపోదని, ఆ ఇంట్లోని వినియోగం కూడా వాస్తు నియమాలకు అనుగుణంగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. అప్పుడే సిరిసంపదలు, సుఖసంతోషాలు లభిస్తాయన్నారు. ‘వాస్తును నిర్లక్ష్యం చేస్తే.. అనుకోని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాస్తు నిపుణులను సంప్రదించి, స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. వాస్తును పాటిస్తే శుభాలు చేకూరుతాయి’ అని ఆయన వివరించారు. <<-se>>#Vasthu<<>>


