News August 11, 2024
తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు ఏపీ స్టూడెంట్స్ మృతి

తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. చెన్నైలోని SRM కాలేజీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు నిన్న సెలవు కావడంతో తిరువళ్లూరు వెళ్లారు. ఇవాళ చెన్నైకి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో నితీశ్ వర్మ, రామ్, చేతన్, నితీశ్, యుకేశ్ మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Similar News
News October 27, 2025
CSIR-CCMBలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ 4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 29 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని నవంబర్ 28 వరకు స్పీడ్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://www.ccmb.res.in/
News October 27, 2025
కాస్త రిలీఫ్.. తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రేట్ రూ.1,140 తగ్గి రూ.1,24,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,050 దిగివచ్చి రూ.1,14,100గా ఉంది. ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలు కాస్త తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. అటు రేట్లు తగ్గడంపై పెట్టుబడిదారులు నిరాశకు గురవుతున్నారు. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ రూ.1,70,000గా ఉంది.
News October 27, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.


