News November 20, 2024
రోడ్డు ప్రమాదాలు.. గంటకు 20 మంది మృతి
దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. సగటున గంటకు 20 మంది చనిపోయారు. 4.62 లక్షల మంది గాయపడ్డారు. 2022తో పోల్చుకుంటే మృతులు, గాయాలపాలైన వారి సంఖ్య పెరిగింది. అత్యధికంగా UPలో 23,652 మంది, TNలో 18,347 మంది, MHలో 15,366 మంది చనిపోయారు. అటు అత్యధికంగా TNలో 67,213 ప్రమాదాలు జరిగాయి.
Similar News
News November 20, 2024
దేశ రాజధానిని మార్చడం సాధ్యమేనా?
కాలుష్య మయమైన ఢిల్లీని రాజధానిగా కొనసాగించడం అవసరమా అని కాంగ్రెస్ MP శశిథరూర్ లేవనెత్తిన ప్రశ్న చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటికే పలు కారణాలతో 8 దేశాలు తమ రాజధానులను మార్చాయి. నైజీరియా(లాగోస్-అబుజా), మయన్మార్(రంగూన్-నైపిడావ్), రష్యా(సెయింట్ పీటర్స్బర్గ్-మాస్కో), పాకిస్థాన్(కరాచీ-ఇస్లామాబాద్), బ్రెజిల్(రియో డి జనీరో-బ్రెసిలియా), కజకిస్థాన్, టాంజానియా, ఐవరీ కోస్ట్ సైతం తమ రాజధాని నగరాలను మార్చాయి.
News November 20, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.550 పెరిగి రూ.77,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10గ్రా. ధర రూ.500 పెరిగి రూ.71,150గా నమోదైంది. అయితే వెండి ధరల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.
News November 20, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి త్వరలో మెలోడీ సాంగ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ థర్డ్ సింగిల్పై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అప్డేట్ ఇచ్చారు. ఇది మెలోడీ సాంగ్ అని, త్వరలో రిలీజ్ అప్డేట్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే జరగండి, రా మచ్చా మచ్చా సాంగ్స్ రిలీజవగా మ్యూజిక్ లవర్స్ను మెప్పించాయి. దీంతో హీరోహీరోయిన్ మధ్య నడిచే మెలోడీకి సెట్స్, మ్యూజిక్ ఎలా ఉంటాయోనని? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.