News November 19, 2024

ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీకి రోడ్ల నిర్వహణ: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో రాష్ట్ర రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని <<14653659>>సీఎం చంద్రబాబు<<>> చెప్పారు. ప్రస్తుతం శరవేగంగా రోడ్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మన దగ్గర డబ్బుల్లేవు.. ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. హైవేల మాదిరి రహదారుల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే యోచన చేస్తున్నాం. తొలుత ఉభయగోదావరి జిల్లాల్లో అమలు చేస్తాం’ అని తెలిపారు.

Similar News

News November 29, 2024

టెన్త్ విద్యార్థులకు గ్రేడింగ్ విధానం తొలగింపు

image

TG: టెన్త్ పరీక్షల్లో <<14735937>>ఇంటర్నల్ మార్కులను<<>> తొలగించిన విద్యాశాఖ గ్రేడింగ్ విధానాన్నీ తొలగించాలని నిర్ణయించింది. ఏ1, ఏ2, బి1, బి2 గ్రేడులకు బదులు మార్కులను ప్రకటించనుంది. అలాగే ఆన్సర్ షీట్లలో కూడా మార్పులు చేసింది. 4 పేజీల బుక్ లెట్+అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల ఆన్సర్ బుక్ లెట్లను ఇవ్వనుంది. సైన్స్ పేపర్లకు ఒక్కో దానికి 12 పేజీల ఆన్సర్ బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించింది.

News November 29, 2024

150వ టెస్ట్ మ్యాచులో డకౌట్

image

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌కు తన 150వ టెస్ట్ మ్యాచులో నిరాశ ఎదురైంది. NZతో తొలి టెస్టులో ఆయన డకౌట్ అయ్యారు. దీంతో AUS మాజీ క్రికెటర్లు స్టీవ్ వా, రికీ పాంటింగ్ సరసన చేరారు. వీరిద్దరూ తమ 150వ టెస్టులో డకౌట్‌గా వెనుదిరిగారు. 2002లో PAKపై స్టీవ్, 2010లో ENGపై పాంటింగ్ 150th టెస్ట్ ఆడారు. రూట్ కంటే ముందు 10 మంది క్రికెటర్లు 150 టెస్టులు ఆడిన ఘనతను అందుకున్నారు. అత్యధిక టెస్టులు సచిన్(200) ఆడారు.

News November 29, 2024

బూడిద చిచ్చు.. నేడు సీఎం వద్ద పంచాయితీ

image

AP: RTPPలో ఉత్పత్తయ్యే పాండ్ యాష్(బూడిద) తరలింపు విషయంలో BJP MLA ఆదినారాయణరెడ్డి, TDP నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య తలెత్తిన గొడవ కొలిక్కి రాలేదు. దీంతో వారికి సీఎంవో నుంచి పిలుపువచ్చింది. ఇవాళ సీఎం చంద్రబాబు వారితో సమావేశం కానున్నారు. RTPP నుంచి వేల టన్నుల బూడిద విడుదలవుతోంది. దీన్ని సిమెంట్ కంపెనీలకు తరలించడానికి తమకు వాటాలు కావాలని ఇరు వర్గాలు భీష్మించుకున్నాయి.