News October 21, 2024

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు.. త్వరలో నియోజకవర్గాలకు నిధులు!

image

TG: వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 1,320KM మేర మరమ్మతులు చేయాల్సి ఉండగా రూ.1,375 కోట్లు అవసరమని అంచనా వేసింది. R&B పరిధిలో 2,555KM రోడ్లు ధ్వంసం కాగా రూ.2,500 కోట్లు కావాలని తేల్చింది. నియోజకవర్గాల వారీగా ఆ నిధులను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు కేంద్ర సహకారమూ కోరనుంది.

Similar News

News October 21, 2024

రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు ముఖ్యం: CM రేవంత్

image

TG: ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని సీఎం రేవంత్ అన్నారు. గోషామహల్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు.

News October 21, 2024

రైతుబంధు కావాలా? రాబందు కావాలా?: KTR

image

TG: ఎకరానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పదివేలు ఊడగొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. రైతు బంధు కావాలా?.. రాబందు కావాలా? అని Xలో ప్రశ్నించారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లుగా పరిస్థితి ఉందని సెటైర్లు వేశారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే, అన్నదాత వెన్ను విరవడమేనని దుయ్యబట్టారు.

News October 21, 2024

అదనంగా 1.4లక్షల మందికి పంట రుణాలు!

image

AP: ఈ రబీ సీజన్‌లో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని వ్యవసాయశాఖ నిర్దేశించింది. అందులో రూ.68,060 కోట్లు పంట రుణాలు, రూ.32,390 కోట్లు టర్మ్ లోన్స్ ఇవ్వనుంది. గత సంవత్సరం 3.60 లక్షల మంది కౌలు దారులకు రూ.4,100 కోట్లు రుణాలు ఇచ్చింది. కాగా ఈసారి కనీసం 5 లక్షల మందికి రూ.5వేల కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.