News June 10, 2024

త్వరలో అమరావతిలో రహదారులు బాగు చేస్తాం: సీఆర్డీఏ కమిషనర్

image

AP: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని CRDA కమిషనర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో ఇవాళ ఆయన పర్యటించారు. అక్కడి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధానిలో రహదారులను బాగు చేస్తామని చెప్పారు. చివరి దశలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 22, 2024

మెగాస్టార్ తర్వాతి సినిమా తమిళ డైరెక్టర్‌తో?

image

మెగాస్టార్ చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు. వశిష్టతో ‘విశ్వంభర’ రెడీ అవుతుండగా శ్రీకాంత్ ఓదెలతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరి తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్‌తో మూవీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కార్తీతో ‘సర్దార్’ సినిమాను తీశారు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, పూర్తి కథను డెవలప్ చేయమని సూచించారని సమాచారం.

News December 22, 2024

భారత్‌పై మరోసారి బంగ్లా ఆరోపణలు

image

మాజీ ప్రధాని షేక్ హ‌సీనా హ‌యాంలో ప్ర‌జ‌లు అదృశ్యమైన ఘ‌ట‌న‌ల్లో భార‌త్ హ‌స్తం ఉంద‌ని బంగ్లా ప్ర‌భుత్వ ఎంక్వైరీ క‌మిష‌న్ ఆరోపించింది. బంగ్లా ఖైదీలు భార‌తీయ జైళ్ల‌లో మ‌గ్గుతున్నార‌ని పేర్కొంది. భార‌త్‌లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయుల‌ను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ విదేశాంగ, హోం శాఖలకు క‌మిష‌న్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేసింది.

News December 22, 2024

రైల్వేలో పోస్టులు.. వివరాలివే

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 7- ఫిబ్రవరి 6 మధ్యలో తమ <>వెబ్‌సైట్<<>> ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు రుసుం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250 ఉంది. పోస్టుల్లో ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్‌కు 338 ఖాళీలుండగా అత్యల్పంగా సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 2 ఖాళీలున్నాయి.