News November 12, 2024

ROB భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్, జెసి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మంగళవారం వివిధ జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆర్ఓబీకి సంబంధించిన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే ట్రాన్స్‌కోకు సంబంధించిన చెల్లింపులు చేయాల్సి ఉందని వాటిని త్వరలోనే ఇస్తామన్నారు.

Similar News

News November 14, 2024

కోటబొమ్మాళి: రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందింది. ఈ మేరకు రైలు పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పలాస జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. కాగా వృద్ధురాలు వివరాలు తెలియరాలేదు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News November 13, 2024

ఎచ్చెర్ల: ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ జవాన్

image

ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు (33) అనే ఆర్మీ జవాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బికనీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాను ఉన్న గదిలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డినట్లు ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో సమాచారం అందించారు. స్వగ్రామానికి మృతదేహం తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

News November 13, 2024

మాదకద్రవ్య రహిత శ్రీకాకళం జిల్లాగా కృషి చేయాలి: ఎస్పీ

image

మాదకద్రవ్యాల రహిత జిల్లాగా రూపుదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలని జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ విచ్చలవిడిగా శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉందని దీన్ని పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.