News November 23, 2024

ప్రియాంక గెలుపుపై స్పందించిన రాబర్ట్ వాద్రా

image

తన భార్య ప్రియాంకా గాంధీ వయనాడ్‌లో గెలవడంపై రాబర్ట్ వాద్రా స్పందించారు. ‘ప్రియాంక కృషిని గుర్తించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. నాకూ అలాంటి సమయం రావొచ్చు. ప్రజల కోసం నేను శ్రమిస్తూనే ఉంటా. ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది’ అని వాద్రా మీడియాతో అన్నారు.

Similar News

News February 6, 2026

కల్తీ నెయ్యి కేసు.. చిన్నప్పన్నకు బెయిల్

image

AP: కల్తీ నెయ్యి కేసు నిందితుడు చిన్నప్పన్నకు హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దర్యాప్తు పూర్తయి ఛార్జ్‌షీట్ కూడా దాఖలైనందున పిటిషనర్‌ను కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంది. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. రెండు వారాల్లో తనకు ఉన్న స్థిర, చరాస్తుల వివరాలతో ట్రయల్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలంది.

News February 6, 2026

‘ఫార్మర్ రిజిస్ట్రీ’ వల్ల కలిగే లాభాలేంటి?

image

కేంద్రం అమలు చేసే పథకాల లబ్ధి పొందాలంటే రైతులకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ తప్పనిసరి. పెట్టుబడి సాయం ‘పీఎం కిసాన్’ అందాలన్నా, పంటల బీమా ‘ఫసల్ బీమా’ నిధులు జమ కావాలన్నా, ఎరువుల రాయితీలు, పంట రుణాలు పొందాలన్నా ఈ 11 అంకెల విశిష్ఠ నెంబర్ ఉండాల్సిందే. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి అమలయ్యే పథకాల లబ్ధిని అన్నదాతలు పొందాలన్నా ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ని తప్పనిసరి చేసే అవకాశం ఉంది. అందుకే నిర్లక్ష్యం చేయొద్దు.

News February 6, 2026

ఏపీ దళిత ఎంపీని కాంగ్రెస్ అవమానించింది: మోదీ

image

లోక్‌సభ స్పీకర్ ఛైర్‌లో కూర్చున్న ఏపీకి చెందిన దళిత ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ను కాంగ్రెస్ సభ్యులు అవమానించారని PM మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణప్రసాద్‌పై కాగితాలు విసిరేశారని మండిపడ్డారు. అలాగే అస్సాంకు చెందిన BJP MP దిలీప్ సైకియా అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడూ ఇలాగే ప్రవర్తించారని దుయ్యబట్టారు. వారికి దళితులపై చిన్నచూపు ఉందన్నారు.