News August 10, 2025
రాబర్ట్ వాద్రా రూ.58 కోట్లు తీసుకున్నారు: ED

ఆర్థిక నేరం కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త <<16104501>>రాబర్ట్<<>> వాద్రాకు ఉచ్చు బిగుస్తోంది. అక్రమ ల్యాండ్ డీల్ వ్యవహారంలో ఆయనకు రూ.58 కోట్ల ముడుపులు అందినట్లు ఛార్జ్‌షీట్‌లో ED పేర్కొంది. స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.53 కోట్లు, బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రూ.5 కోట్లు పొందారంది. ఈ డబ్బుతో ఆయన స్థిరాస్తుల కొనుగోళ్లతో పాటు పెట్టుబడులు పెట్టారని తెలిపింది.
Similar News
News August 10, 2025
పులివెందుల వైపే రాష్ట్రం చూపు..

AP: పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల బరిలో 11 మంది చొప్పున బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీడీపీ, YCP అభ్యర్థుల మధ్యే ఉంది. పులివెందులలో హేమంత్ రెడ్డి(వైసీపీ), మారెడ్డి లతారెడ్డి(TDP) మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశముంది. ఒంటిమిట్టలో సుబ్బారెడ్డి(YCP), ముద్దు కృష్ణ రెడ్డి(టీడీపీ) బరిలో నిలిచారు. అటు వైసీపీ చీఫ్ జగన్ పులివెందుల MLA కావడంతో ఈ ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
News August 10, 2025
రాత్రి వేళ యూరిన్ ఎక్కువగా వస్తుందా?

రాత్రిళ్లు యూరిన్ ఎక్కువగా రావడాన్ని నోక్టురియా అంటారని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో వయస్సు పెరిగే కొద్దీ లేదా నీళ్లు ఎక్కువగా తాగితే యూరిన్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే డయాబెటిస్, యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ వంటి సమస్యలు ఉన్నా ఇలా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. యూరిన్ లీకవ్వడం, బ్లడ్ రావడం, కాళ్ల వాపులు వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News August 10, 2025
‘బనకచర్ల’ను ఎలా ఆపాలో మాకు తెలుసు: భట్టి

TG: కాంగ్రెస్ పాలనలో రివేంజ్ పాలిటిక్స్‌కు తావులేదని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ‘కాళేశ్వరంపై నివేదికను మేం మార్చామన్నది అవాస్తవం. పెన్షన్ల పెంపు తప్పా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం. ఉద్యోగాలపై మాట నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు తొలుత కంటే ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారు. బనకచర్లపై AP మంత్రి లోకేశ్ వ్యాఖ్యలు సరికాదు. ఆ ప్రాజెక్టును ఎలా ఆపాలో మాకు తెలుసు’ అని స్పష్టం చేశారు.