News March 25, 2025
టికెట్ ధరల పెంపుపై ‘రాబిన్ హుడ్’ టీమ్ ప్రకటన

కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో మినహా ఏపీ, తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదని రాబిన్ హుడ్ మూవీ యూనిట్ తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. అభిమానులకు సరసమైన ధరలకే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. సమీప థియేటర్లలో ఈ నెల 28న రాబిన్ హుడ్ సినిమా చూసి ఆనందించాలని కోరింది.
Similar News
News January 19, 2026
బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్‌లైన్!

భద్రతా కారణాలతో T20 WC మ్యాచుల వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ <<18885677>>కోరుతుండటం<<>> తెలిసిందే. ఈ క్రమంలో మార్పు సాధ్యం కాదని BCBకి ICC చెప్పినట్లు సమాచారం. తుది నిర్ణయం చెప్పేందుకు ఈ నెల 21 వరకు డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. ఒకవేళ బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమిస్తే ర్యాంకింగ్ ప్రకారం స్కాట్లాండ్ మ్యాచులు ఆడనుంది. ఫిబ్రవరి 7 నుంచి ఇండియా, శ్రీలంక వేదికగా WC ప్రారంభం కానుంది.
News January 19, 2026
ఈ కలెక్టర్ ఎందరికో స్ఫూర్తి!

జిల్లాలోని పేదలందరికీ పథకాలు అందే వరకు జీతం తీసుకోనని ప్రతిజ్ఞ చేశారో కలెక్టర్. ‘ఫ్రీ రేషన్, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు పలన్హర్ యోజన, పేదలు, వితంతువులకు పెన్షన్ పథకాలకు లబ్ధిదారులందరినీ నమోదు చేయాలని అధికారులను ఆదేశించా. లేదంటే జీతం తీసుకోనని చెప్పా. వారిని మోటివేట్ చేసేందుకే ఇలా చేశా’ అని రాజ్‌సమంద్(RJ) కలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు. పేదలకు పథకాలు ఆలస్యమవడమంటే అన్యాయం చేయడమేనని చెప్పారు.
News January 19, 2026
రాణా బ్యాటింగ్ అద్భుతం: సునీల్ గవాస్కర్

న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో టీమ్‌ఇండియా బౌలర్ హర్షిత్ రాణా అద్భుతంగా బ్యాటింగ్ చేశారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. షార్ట్ పిచ్ బాల్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని చెప్పారు. టీమ్ ఒత్తిడిలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన రాణా చక్కటి ఇన్నింగ్స్ ఆడారని తెలిపారు. రాణా 43 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 52 రన్స్ చేశారు. 7వ వికెట్‌కు విరాట్‌తో కలిసి 99రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.


