News May 4, 2024
ఎన్నికల సింబల్స్‌గా రోబోట్, బిస్కెట్, పెన్‌డ్రైవ్

లోక్‌సభ ఎన్నికల కోసం ఫ్రీ సింబల్స్ జాబితాలో కొన్ని విచిత్రాలు చోటుచేసుకున్నాయి. రోబోట్, న్యూడిల్స్ బౌల్, వేరు శనగ, లూడో, వంట గది సింక్, సోప్ డిష్, ల్యాప్‌టాప్, ప్యాంట్, CCకెమెరా, వాల్నట్, స్విచ్ బోర్డ్, పెన్ డ్రైవ్, ఫోన్ ఛార్జర్, బిస్కెట్, సైకిల్ పంప్, కంప్యూటర్ మౌస్, గిఫ్ట్ ప్యాక్ హీటర్, స్టంప్స్ లాంటివి కూడా గుర్తులుగా ఉన్నాయి. ఇండిపెండెంట్లు, గుర్తింపు లేని పార్టీలకు వీటిని EC కేటాయిస్తుంది.
Similar News
News January 23, 2026
జేడ్ రోలర్‌తో మెరిసే చర్మం

అలసిన ముఖానికి సాంత్వన కలిగించే అద్భుతమైన పరికరం జేడ్ రోలర్. ముఖాన్ని శుభ్రం చేసి రోజ్‌వాటర్ అద్దాలి. తర్వాత జేడ్ రోలర్‌తో సవ్య, అపసవ్య దిశల్లో మసాజ్ చేయాలి. రోజుకి మూడుసార్లు మసాజ్ చేస్తే చర్మంపై లింఫాటిక్ ఫ్లూయిడ్ విడుదల తగ్గుతుంది. మసాజ్ చేయడంవల్ల ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ జరిగి, ఆక్సిజన్ అంది చర్మం కాంతివంతం అవుతుంది. కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గి, చర్మం తాజాగా ఉంటుంది.
News January 23, 2026
ఏ శుభకార్యానికైనా నేడు ఉత్తమ దినం!

నేడు వసంత పంచమి. చదువుల తల్లిని కొలిచే పవిత్రమైన రోజు. ఇది అక్షరాభ్యాసాలకే కాకుండా వివాహం, అన్నప్రాశన, గృహప్రవేశం వంటి ఎన్నో శుభకార్యాలకు ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన చేసే ఏ కొత్త పనికైనా దైవబలం తోడై విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నేడు ఏ రంగు దుస్తులు ధరిస్తే, వేటిని పూజిస్తే సరస్వతీ దేవి కటాక్షంతో నైపుణ్యాలు పెరుగుతాయో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News January 23, 2026
శ్రీనిధి రకం కోళ్ల ప్రత్యేకత ఏమిటి?

శ్రీనిధి జాతి కోళ్లు గోధుమ రంగులో ఉంటాయి. నాటుకోడి గుడ్లకు సమానంగా ఈ కోడి గుడ్లు కూడా అధిక పోషకాలను కలిగి ఉంటాయి. ఈ కోళ్లు 5 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. ఏడాదికి 140 నుంచి 160 గుడ్లను పెడతాయి. అన్ని వాతావరణ పరిస్థితులను, కొన్ని రకాల వ్యాధులను తట్టుకొని జీవిస్తాయి. పొడవైన కాళ్లతో, ఆకర్షణీయంగా ఉంటాయి. పెరటికోళ్లు పెంచాలనుకునేవారికి శ్రీనిధి కోళ్లు కూడా అనుకూలమైనవి.


