News August 26, 2024
BCCI నూతన సెక్రటరీగా రోహన్ జైట్లీ?

భారత క్రికెట్ బోర్డు ప్రస్తుత సెక్రటరీ జైషా ICC ఛైర్మన్ పోస్టుకు నామినేషన్ వేయనున్నారు. ఆయన స్థానంలో రోహన్ జైట్లీ BCCI సెక్రటరీ అయ్యేందుకు దాదాపు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. BJP దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడే రోహన్ జైట్లీ. ప్రొఫెషనల్ లాయర్ అయిన రోహన్ ప్రస్తుతం ఢిల్లీ & జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అటు ICC ఛైర్మన్ అయ్యేందుకు షాకు సైతం సరిపడా మద్దతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 28, 2026
జియోలో 30 రోజుల కొత్త ప్లాన్స్ తెలుసా!

JIO నుంచి 30 రోజుల స్పెషల్ రీఛార్జ్ ప్లాన్స్ మరో 2 అందుబాటులోకి వచ్చాయి. రూ.365, రూ.355 ప్యాక్స్‌తో రీఛార్జ్ చేస్తే 30 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMS, 25GB డేటా, 3 నెలల పాటు JIO హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. డేటా పూర్తయినా 64kbps స్పీడ్‌తో డేటాను వినియోగించుకోవచ్చు.
News March 28, 2026
BREAKING: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

AP: రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. దీని కోసం ఇవాళ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా ఐదున్నర గంటల పాటు చర్చ జరిగింది. ఈ నెల 30వ తేదీ తిరిగి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
News March 28, 2026
అల్లు అర్జున్‌కు నేనే డాన్స్ నేర్పించా: రాధిక ఫన్నీ కామెంట్స్

అల్లు అర్జున్‌కు తానే డాన్స్ నేర్పానని నటి రాధిక చెప్పారు. ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న డాన్స్ షోలో ఓ కంటెస్టెంట్ పుష్ప సాంగ్‌కు డాన్స్ చేశారు. జడ్జిమెంట్ టైమ్‌లో రాధిక మాట్లాడుతూ.. అల్లుఅర్జున్ ఇంత మంచి డాన్సర్ కావడానికి తానే కారణమన్నారు. గీతా ఆర్ట్స్‌లో తానో మూవీ తీశానని, అందులోని ఓ సీన్‌లో బాలుడిగా ఉన్న బన్నీని ఎత్తుకొని రైల్వే ట్రాక్ వెంట పరిగెడుతూ డాన్స్ చేయడం నేర్పించానని ఫన్నీగా చెప్పారు.


