News November 4, 2024
BCCI తదుపరి సెక్రటరీగా రోహన్ జైట్లీ?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) కార్యదర్శిగా రోహన్ జైట్లీని నియమించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఈనెలలో జైషా ఈ పదవికి రాజీనామా చేసి DEC 1న ICC తదుపరి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. రోహన్ జైట్లీ 2020 నుంచి ఢిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అనిల్ పటేల్ సైతం BCCI సెక్రటరీ పదవి కోసం పోటీ పడుతున్నారు. దీనిపై త్వరలో ప్రకటన రానుంది.
Similar News
News December 6, 2025
సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.
News December 6, 2025
గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి

TG: ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సమ్మిట్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News December 6, 2025
వేంకన్న గుడికి పట్నాలో 10.11 ఎకరాలు

పట్నాలో తిరుమల వేంకన్న గుడి నిర్మాణానికి 10.11 ఎకరాలను బిహార్ ప్రభుత్వం కేటాయించింది. ₹1 టోకెన్ రెంటుతో 99 ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర CS ప్రతయ అమృత్ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడిందని నాయుడు తెలిపారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


