News February 12, 2025

రోహిత్, కోహ్లీ వారిద్దరితో మాట్లాడాలి: కపిల్ దేవ్

image

భారత స్టార్లు కోహ్లీ, రోహిత్ మాజీ ప్లేయర్లతో మాట్లాడాలని దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ సూచించారు. రోహిత్ గత వన్డేలో సెంచరీ చేశారు. అయితే ఆయన, కోహ్లీ టెస్టుల్లో ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్నారు. ‘వయసవుతున్న మాత్రాన రోహిత్, కోహ్లీ ఒక్కసారిగా ఆటను మర్చిపోరు. కానీ వారి శరీరం అడ్జస్ట్ చేసుకునే తీరు మారుతుంటుంది. దీనిపై గవాస్కర్, ద్రవిడ్ వంటివారితో ఆ ఇద్దరూ మాట్లాడాలి’ అని కపిల్ పేర్కొన్నారు.

Similar News

News February 12, 2025

నేడే మూడో ODI.. జట్టులోకి పంత్, అర్ష్‌దీప్?

image

ఇండియా, ఇంగ్లండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. IND తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. ఈ పిచ్ పరిస్థితులు బ్యాటింగ్‌కు కఠినంగా, బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, డ్యూ కూడా వచ్చే ఛాన్సుందని విశ్లేషకులు చెబుతున్నారు. sports 18-2, హాట్‌స్టార్‌లో మ.1.30 నుంచి లైవ్ చూడవచ్చు. WAY2NEWSలో లైవ్ స్కోర్ అప్‌డేట్స్ పొందవచ్చు.

News February 12, 2025

అధికారులు ప్రతినెలా 3-4 జిల్లాల్లో తిరగాలి: సీఎం

image

AP: గ్రూప్-1 అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏప్రిల్ నుంచి ప్రతి నెలా 3-4 జిల్లాల్లో పర్యటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నతాధికారులు గ్రామాలకు వెళ్లే అంశంపై ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రెవెన్యూ, పోలీస్, విద్య, వైద్య శాఖలకు సంబంధించి ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని పరిష్కరించాలని సూచించారు. ఒక్కొక్క ఉన్నతాధికారి ఒక్కో జిల్లాను దత్తత తీసుకోవాలని పేర్కొన్నారు.

News February 12, 2025

మంచి మాట – పద్యబాట

image

లావుగలవానికంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!

భావం: శారీరకంగా బలంగా ఉన్నవాడికంటే తెలివితేటలు ఉన్నవాడే బలవంతుడు. పర్వతమంత ఆకారంలో ఉండే ఏనుగును సైతం మావటివాడు అవలీలగా మచ్చిక చేసుకుని దానిమీదకు ఎక్కగలడు.

error: Content is protected !!