News August 20, 2025
వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లీ పేర్లు మిస్సింగ్!

ICC వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్, కోహ్లీ పేర్లు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారం క్రితం రోహిత్ 2, కోహ్లీ 4వ స్థానాల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్స్‌లో TOP-100లో కూడా లేరు. దీనికి టెక్నికల్ గ్లిచ్ కారణమా లేదా వారి రిటైర్మెంట్‌కు సంకేతమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూల్ ప్రకారం 9-12 నెలలు ODIs ఆడకపోతే ర్యాంకింగ్స్ నుంచి తొలగిస్తారు. చివరిగా వీరిద్దరూ 2025 మార్చిలో (CT) ODIs ఆడారు.
Similar News
News August 20, 2025
సినీ రంగంలోనూ AI ప్రభావం.. నటీనటులకు గడ్డుకాలమేనా?

ఉద్యోగుల్లో భయాన్ని రేకెత్తిస్తోన్న AI ఇప్పుడు సినీ ఫీల్డ్‌నూ తాకింది. ఇప్పటికే పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించిన ‘మహావతార్ నరసింహ’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో నటీనటులు లేకపోయినా భావోద్వేగాలను సృష్టించొచ్చు అని ఇది నిరూపించింది. ఈక్రమంలో ఏఐతో సినిమాలు తీయడంపై బాలీవుడ్ దృష్టి పెడుతోంది. రామాయణ్, చిరంజీవి హనుమాన్ వంటి చిత్రాలను ఏఐతో రూపొందిస్తోంది. దీనిపై మీ కామెంట్?
News August 20, 2025
సౌదీలో స్కై స్టేడియం

FIFA వరల్డ్ కప్-2034 వేళ సౌదీ అరేబియా వినూత్న స్టేడియాన్ని నిర్మించనుంది. సౌదీ నిర్మించబోయే స్మార్ట్ సిటీలో ఇది ఏర్పాటుకానుంది. ది లైన్ అనే స్మార్ట్ సిటీలో ఎడారి తలానికి 350M ఎత్తులో నిర్మించనున్నారు. 46వేల మంది ప్రేక్షకులు కూర్చొనేలా దీనిని రూపొందించనున్నారు. ఇందుకు $1 బిలియన్‌ను ఖర్చు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. 2027లో ప్రారంభించి 2032 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
News August 20, 2025
కేబుల్, ఇంటర్నెట్ వైర్ల తొలగింపునకు బ్రేక్!

HYDలో కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ప్రభుత్వం <<17454341>>తొలగిస్తున్న<<>> విషయం తెలిసిందే. దీనిపై కేబుల్ ఆపరేటర్లు TG SPDCL CMDతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేబుల్, ఇంటర్నెట్ వైర్లను కట్ చేయొద్దని TG SPDCL నిర్ణయం తీసుకున్నట్లు ఆపరేటర్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న వైర్లను తొలగించాలని, రన్నింగ్‌లో ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను ఒకే బంచింగ్ విధానంలో తీసుకురావాలని CMD సూచించారని పేర్కొన్నారు.