News October 6, 2025
రోహిత్, విరాట్ ప్రపంచకప్ ఆడాలంటే..

2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా కెప్టెన్సీ మార్చిన బీసీసీఐ.. మరో రూల్ పెట్టింది. ఏ ఆటగాడైనా ఖాళీ సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. ప్లేయర్స్ తమ ఫిట్‌నెస్, ఫామ్‌ను కొనసాగించడమే దీని ఉద్దేశం. టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, విరాట్ కూడా ఈ రూల్ పాటించాల్సి ఉంటుంది. అలా అయితేనే వారు 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే ఛాన్స్ ఉంది.
Similar News
News April 2, 2026
మీ రుణం తీర్చుకోలేం: అమరావతి మహిళలు

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో ఏపీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్ధండరాయునిపాలెం సభలో CBN, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. CBN ప్రసంగం సహా సభ అంతా ఉద్వేగభరితంగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహిళలు సభ అనంతరం CM దంపతులకు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ జన్మకు ఇది చాలు సార్. మా బతుకులు నిలబెట్టారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేం’ అని అన్నారు.
News April 2, 2026
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి కీలక ప్రకటన

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులో రెండో విడత లబ్ధిదారుల ఎంపికను ప్రారంభిస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. అటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో భూభారతి పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు.
News April 2, 2026
SRH దూకుడు.. 6 ఓవర్లలోనే 84

IPL: KKRతో మ్యాచులో SRH ఓపెనర్లు దూకుడుగా ఆడారు. పవర్ ప్లేలో 84 రన్స్ చేశారు. అభిషేక్ (34*), హెడ్ సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపించారు. హెడ్ 46 రన్స్ వద్ద క్యాచ్ ఔటయ్యారు. ప్రస్తుతం స్కోర్ 6 ఓవర్లకు 84/1గా ఉంది. మరి 20 ఓవర్లలో ఆరెంజ్ ఆర్మీ ఎంత స్కోర్ చేస్తుందో కామెంట్ చేయండి.


