News December 12, 2024
మూడో టెస్టులో ఓపెనర్‌గా రోహిత్?
AUSతో జరిగే మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో ఆయన దారుణంగా విఫలమవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నెట్స్‌లో ఆయన కొత్త బంతులతోనే ప్రాక్టీస్ చేయడం గమనార్హం. రెండో టెస్టులో రాహుల్ ఓపెనర్‌గా రాగా హిట్ మ్యాన్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి రెండు ఇన్నింగ్సుల్లో 9 పరుగులే చేశారు. గత 12 ఇన్నింగ్సుల్లో ఆయన ఒకే అర్ధసెంచరీ చేశారు.
Similar News
News December 13, 2024
ఈ జిల్లాల్లో రేపు స్కూళ్లకు సెలవు
AP: భారీ వర్షాల నేపథ్యంలో రేపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని కలెక్టర్లు స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
News December 12, 2024
రైతుకు బేడీలు.. విచారణలో ఏం తేలిందంటే?
TG: రైతుకు <<14858119>>బేడీలు వేసిన ఘటన<<>> వెనుక కుట్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ విచారణ చేపట్టారు. దీనికి సంగారెడ్డి జైలు సిబ్బంది తప్పిదమే కారణమని తేల్చారు. జైలు అధికారులు VKB పోలీసులకు బదులుగా సైబరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారని, హీర్యా నాయక్ లగచర్లలో అరెస్టయితే బాలానగర్ కేసులో అరెస్టయినట్లు జైలు రికార్డుల్లో ఉందని గుర్తించారు. సంగారెడ్డి జైలర్ సంతోష్ కుమార్ రాయ్‌ను సస్పెండ్ చేశారు.
News December 12, 2024
రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?
APలో రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడటంతో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అయితే శుక్రవారం విద్యాసంస్థలకు సెలవుపై కలెక్టర్లు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇవాళ ఆలస్యంగా సెలవు ప్రకటించడంతో అప్పటికే ఆ 2 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.